ఉగాది పచ్చడి ugadi pachadi
ముందుగ అందరికి ఉగాది శుభాకాంక్షలు .
కావలసిన పదార్థాలు
మామిడికాయ ముక్కలు - 1 కప్పు (సన్నగా తరిగినవి)
చింతపండు - నిమ్మకాయంత
బెల్లం - అరకప్పు
అరటిపళ్లు - 2
కారం - కొద్దిగా, ఉప్పు - చిటికెడు
వేపపూత - 5 రెమ్మలు
ఉగాది పచ్చడి ugadi pachadi తయారు చేసే విధానం
చింతపండు గిన్నెలో నానబెట్టి రసం తియ్యాలి
. మామిడికాయ, అరటిపండ్లు చిన్నచిన్న ముక్కలు చెయ్యాలి. బెల్లం సన్నగా తరగాలి. చింతపండు రసంలో... తరిగిన బెల్లం, అరటికాయ ముక్కలు, మామిడి, వేపపువ్వు, కారం, ఉప్పు వేసి కలిపి ఓ ఐదు నిమిషాలు ఉంచి తినేయొచ్చు (కారానికి బదులు మిర్చి ముక్కలు కూడా వాడుకోవచ్చు). కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా, కొంచెం కారంగా, కొంచె ఉప్పగా, చిరు చేదు ఉన్నా కూడా బావుంటుంది. ఇష్టమైనవాళ్లు చెరుకు ముక్కలు కూడా వేసుకోవచ్చు.
Andariki ugadi subhakankshalu
ReplyDelete