Garlic Rice
గార్లిక్ రైస్ కావలసినవి:
సోనామసూరి బియ్యం- 100గ్రా
ఆవాలు - రెండు టీ స్పూన్లు
శనగపప్పు - పది గ్రా
పచ్చిమిర్చి- ఆరు
వెల్లుల్లి- 100గ్రా (రేకులను విడదీసి పొట్టు ఒలుచుకోవాలి)
కరివేపాకు- 50గ్రా
నెయ్యి - 50గ్రా
నిమ్మచెక్క - ఒకటి
ఎండుమిర్చి - రెండు
ఉప్పు - తగినంత
గార్లిక్ రైస్ తయారి:
అన్నాన్ని పలుకుగా వండి వెడల్పు పాత్రలో వేసి చల్లారనివ్వాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి కొంత కరివేపాకును
వేయించి పక్కన పెట్టాలి. మిగిలిన నేతిలో ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి
వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో వెల్లుల్లి రేకులు వేసి సన్నమంట మీద కొద్ది సెకన్ల పాటు వేగనివ్వాలి.
ఇప్పుడు ఉప్పు, అన్నం కలిపి దించేయాలి. చివరగా నిమ్మరసం కలిపి, నేతిలో వేయించిన కరివేపాకుతో గార్నిష్
చేయాలి.
Thanks for reading our recipies and If any one interested to write or ask any recipie you can ask. we will write it for you.
Comment us your valuable feedback.
No comments:
Post a Comment