Saturday, April 11, 2015

VANILLA ICE CREAM

Vanilla ice cream (వెనిల్లా ఐస్‌క్రీమ్‌)



How to prepare vanilla icecream?


కావలసిన పదార్థాలు
పాలు - 1 1/2 కప్పు
పాలమీగడ - 1 1/2 కప్పు
పంచదార - ముప్పావు కప్పు
మైదాపిండి - 1 1/2 కప్పు
వెనిల్లా ఎసెస్స్‌ - అరస్పూన్‌

తయారుచేసే పద్ధతి
మైదాపిండి రెండు స్పూన్ల పాలలో కలిపి, పేస్టులా తయారుచేసుకోవాలి. మిగిలిన పాలు బాగా మరిగిన తర్వాత మైదాపిండి పేస్టు, పంచదార వేసి గరిటతో కలియబెడుతూ సన్నని సెగపై ఉంచాలి.

బాగా ఉడికి చిక్కగా అయ్యాక దించాలి. దానిని చల్లార్చి ఒక ట్రేలో పోసి ఫ్రీజర్‌లో 4, 5 గంటలు వుంచాలి. తర్వాత ఐస్‌క్రీమ్‌ను గిన్నెలో వేసి మజ్జిగకవ్వంతో కానీ ఎగ్‌ బీటర్‌తో కానీ చిలకాలి. అందులో వెనిల్లా ఎసెన్స్‌, మీగడ కలిపి మరల ట్రేలో వాక్స్‌ పేపర్‌వేసి ఐస్‌క్రీమ్‌ పోసి ఫ్రీజర్‌లో పెట్టాలి. గట్టిపడిన తర్వాత సర్వ్‌ చేయాలి.

ఇది మీ పిల్లలకి evening రాగానే చేసి పెట్టండి. ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. (No Chemicals or preservatives) :)

Facebook Comments

No comments:

Post a Comment