Thursday, April 9, 2015

Dhum Aloo


Dhum Aloo(దమ్‌ ఆలూ)



దమ్‌ ఆలూ కావలసిన పదార్ధాలు:

ఆలూ : 900 గ్రా
అల్లం : 1 టేబుల్‌ స్పూన్‌ (సన్నగా తరిగినది)
నీళ్ళు : 3/4 కప్పు
నూనె/ నెయ్యి: వేయించడానికి తగినంత
నెయ్యి : 1 కప్పు
ఉల్లిపాయ : 1 పెద్దది (సన్నగా తరిగి)
టొమాటో ప్యూరీ: 4 టేబుల్‌ స్పూన్లు
పెరుగు : 1 పెద్ద కప్పు
వేడి నీళ్ళు : 4 టేబుల్‌ స్పూన్లు
పచ్చిమిర్చి : 1 (గింజలు తీసేసి
సన్నగా తరిగి)
జీలకర్ర : 1 టీ స్పూన్‌
గరం మసాలా: 1 టీ స్పూన్‌
ఉప్పు : తగినంత
మసాలా దినుసులు:

లవంగాలు : 4
బిర్యానీ ఆకులు: 4
మిరియాలు : 6
ఇలాచీ : 4
దాల్చిన చెక్: 1
మసాలా ముద్దకు:
ఉల్లిపాయ : 1 పెద్దది (సన్నగా తరిగి)
మిరియాలు : 6
గసాలు : 1 టీ స్పూన్‌
ధనియాలు : 1 టేబుల్‌ స్పూన్‌
జీలకర్ర : 1 టీ స్పూన్‌
ఎండు మిర్చి: 2
పసుపు : చిటికెడు
జాజికాయపొడి: 1 చిటికెడు


దమ్‌ ఆలూ తయారు చేసే విధానం: ఆలు గడ్డలకు తొక్కు తీసి ఫోర్క్‌తో దానిపై పొడిచి వాటిని కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో రెండు గంటలపాటు ఉంచాలి. తర్వాత వాటి ని తీసి ఒక బట్టపై ఆరబెట్టాలి. బాణలిలో నూనె కానీ నెయ్యి కానీ పోసి వేడి అయిన తర్వాత ఈ ఆలుగడ్డలను బంగారు రంగు వ చ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మసాలా ది నుసులు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. ముద్దకోసం పెట్టుకున్న వా టన్నింటినీ మెత్తగా నూరి వేగిన ఉల్లిపాయలలో వేయాలి. ఈ మొత్తాన్ని 10 నిల పాటు ఉడకనివ్వాలి. అనంతరం దానిపై టొమాటో గుజ్జు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో.. వేయించి పెట్టుకున్న ఆలూ, వేడినీటిని వేసి ఒక 5 నిల పాటు తక్కువ మంట మీద కలుపుతూ ఉంచాలి. దమ్‌ ఆలూపై మిరియాలపొడి, గరం మసాలా పొడి వేసి కొద్ది నిమిషాల పాటు ఉడకనిచ్చి దించేయాలి. వేడి వేడి దమ్‌ ఆలూ తయార్‌. ఇది చపాతీలలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది.

Facebook Comments

No comments:

Post a Comment