Saturday, April 18, 2015

TAVA MURG (తవా ముర్గ్ )

TAVA MURG (తవా ముర్గ్ )
Special Chicken Curry
Chicken Murg


How to do Chicken Curry?




కావలసినవి:

చికెన్ బ్రెస్ట పీస్-200 గ్రా,

శనగపిండి-10 గ్రా,

గుడ్డు సొన-టేబుల్‌స్పూన్,

వెనిగర్-రెండు టీ స్పూన్లు, కారం-టీస్పూన్,

ఉప్పు-తగినంత,

ధనియాలపొడి-రెండు టీ స్పూన్లు,

జీలకర్రపొడి-టీ స్పూన్,

గరం మసాల పౌడర్-అర టీ స్పూన్,

నిమ్మరసం-రెండు టేబుల్ స్పూన్లు,

నూనె-టేబుల్ స్పూన్,

అల్లంవెల్లుల్లి పేసు-టేబుల్ స్పూన్లు




తయారి:

1) ముందుగా చికెన్ బ్రెస్ట్ పీస్‌ని శుభ్రంగా కడిగి పలుచని స్లైసస్‌గా కట్ చేసుకోవాలి.


2) ముక్కల మీద శనగపిండి చల్లి చేత్తో కలపాలి. శనగపిండి ముక్కల్లో తడిని పీల్చుకోవడమే కాక పచ్చివాసనని కూడా తగ్గిస్తుంది.


3) ఇప్పుడు ఒక బౌల్‌లో చికెన్ పీసెస్, అల్లంవెల్లుల్లి ముద్ద, వెనిగర్, గుడ్డు సొన, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరమ్ మసాల పౌడర్, నిమ్మరసం కలిపి 10 నిమిషాలపాటు నానబెట్టాలి.


4) తర్వాత నాన్ స్టిక్ పాన్ లేదా తవా ని స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి తక్కువ సెగ మీద ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి.


వీటిని లంచ్ లేదా డిన్నర్‌కి ముందు స్టార్టర్స్‌లా తీసుకోవచ్చు.


If you want to write any Delicious dishes you can always write and send to us to rajugarivantalu@gmail.com

Facebook Comments

No comments:

Post a Comment