Friday, April 17, 2015

Special Egg Curry

Special Egg Curry

Special egg curry


Special Egg Curry కొంచం కొత్తగా కొంచం Tasty గా 

కావలసిన పదార్థాలు

కోడి గ్రుడ్డ్లు - 2 ఉడక పెట్టినవి
ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినవి
మీగడ - 1 cup
పచ్చి మిరపకాయలు - 8 తరిగినది
టొమాటో - 2 పేస్టు లాగ చేసినది
షేర్వ - 1 cup
కారం
అజినోమోటో
మిరియాల పొడి
కొత్తిమీర - 1 /2 cup తరిగినది
ఉప్పు
నూనె

తయారు చేసే విధానము

ముందుగ గ్రుడ్డ్లని ఉడక పెట్టి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక బాండలి లో తగినంత నూనె పోసి తరిగిన ఉల్లిపాయ ముక్కలను, పచ్చి మిరపకాయలను, వేసి వేయించాలి.
ఇప్పుడు చేసుకొన్నా టొమాటో పేస్టు ని వేసి ఇంకో రెండు నిముషాల పాటు fry చేసుకోవాలి.
అందులో ఒక cup నీళ్ళు పోసి, తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి, చిటికెడు అజినోమోటో వేసి ఇంకో రెండు నిముషాల పాటు ఉడికించుకోవాలి.
అందులో చేసుకొన్నా కోడి గ్రుడ్డు పేస్టు ని, షేర్వ, మీగడ ని వేసి కలుపుకోవాలి.
కర్రీ అంతా చిక్క బడేంత వరకు ఉడక పెట్టుకోవాలి.
దాని మీద కొత్తిమీర చల్లి దించేయాలి.
అంతే స్పెషల్ ఎగ్ కర్రీ రెడీ.

Facebook Comments

No comments:

Post a Comment