Wednesday, March 18, 2015

Indian-sweets-BASUNDI

BASUNDI ( బాసుంది )




కావలిసినవి :

పాలు  1 లీటర్ 
పంచదార - 100 గ్రా (grams )
సారపప్పు - 150 గ్రా (Grams )
జీడిపప్పు - 25 గ్రా (Grams )
యాలకులు -5

     ఒక వెడల్పాటి గిన్నెలో చిక్కటి గేదేపాలు ఒక లీటరు తీసుకొని దాన్ని సమానమైన వేడిలో మరగించాలి.  దానిపై మీగడ కడుతుంది . పక్కనే ఒక గిన్నె పెట్టుకుని


అందులో మీగడ కట్టగానే తీసి పక్కనున్న గిన్నెలో వేస్తూ ఉండాలి. ఈ విధంగా పాలు చివరికి కొద్దిగా మిగిల్చిన పాలు దించి అందులో పంచదార , మీగడ మరియు సారపప్పు , జీడిపప్పు , యాలక్కాయలు (పోడుమ్చేసి) వేసి కలియపెట్టండి. ఒక బాక్స్ లో వేసి సుమారు ముప్పావు గంట ప్రిజ్జు లో కూలింగ్ లో ఉంచండి . ఫ్రిజ్జు లేనివారు ఐస్ ముక్కలమధ్య పెట్టి కూలింగ్ చేయవచ్చు .  ఇది 1 లీటరు పాలకు 4 కప్పుల స్వీట్  మాత్రం వస్తుంది .  కానీ చాలా రుచిగా వుంటుంది . 

Facebook Comments

No comments:

Post a Comment