Saturday, March 21, 2015

Andhra Chicken Manchuriya

Andhra Chicken Manchuriya





ఆంధ్ర  చికెన్ మంచూరియ కావలసిన  పదార్థాలు:

బోన్ లెస్ చికెన్ : 1/4 కేజీ

తరిగిన ఉల్లిపాయలు : అరకప్పు

అల్లం, వెల్లుల్లి పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్లు

మిరియాల పొడి : అర టీ స్పూన్

కోడిగ్రుడ్డు : ఒకటి

మైదాపిండి, సోయాసాస్, చిల్లీ సాస్, వెనిగర్, కార్న్ ఫ్లోర్, టమోటా సాస్: ఒక్కో టీస్పూన్

ఉప్పు, నూనె: తగినంత


ఆంధ్ర చికెన్ మంచూరియ తయారీ విధానం:

ముందుగా చికెన్‌ను మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కార్న్ ఫ్లోర్‌లను తగినంత నీటితో కలిపి అరగంట పాటు ఊరనివ్వాలి.
బాణలిలో నూనె పోసి చికెన్‌ను దోరగా వేపి ప్లేటులోకి తీసుకోవాలి. మరో పాత్రలో నూనె పోసి ఉల్లిపాయ తరుగు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను కలిపి బాగా వేపుకోవాలి.

ఇందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ నీరు చేర్చి కాసేపు తెల్లనివ్వాలి. తెల్లాక ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ పీస్‌లను చేర్చి నాలుగు నిమిషాల పాటు వేపాలి. ఇందులో తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ చేర్చి హాట్ హాట్‌గా ఫ్రైడ్రైస్, చపాతీ, రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేయాలి.

Facebook Comments

No comments:

Post a Comment