Sunday, April 12, 2015

Paneer Tikka (పన్నీర్ టిక్క )



Paneer Tikka (పన్నీర్ టిక్క )






పిల్లలకు హెల్దీ స్నాక్ ఇంట్లోనే తయారు చేయాలంటే పనీర్ టిక్కా ట్రై 

చేయండి. 

కావలసిన వస్తువులు:


పనీర్‌ :  200 గ్రాములు 

గట్టిగా ఉండే పెరుగు : నాలుగు టేబుల్ స్పూన్లు 

కారం : ఒక టీ స్పూను.

ఉప్పు : తగినంత 

నూనె : తగినంత 

వెల్లుల్లి పేస్ట్‌  : అర టీ స్పూను.

ఫుడ్‌ కలర్‌(రెడ్‌): చిటికెడు.

చిల్లీ సాస్‌ : ఒక టేబుల్‌ స్పూను.

నిమ్మకాయ : చిన్న ముక్క.

చాట్‌, గరం మసాల పౌడర్‌ : చెరో అర టీ స్పూన్


తయారీ విధానం : 



పనీర్‌ను వెడల్పాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో పెరుగు,

 కారం, ఉప్పు, ఒక స్పూన్ నూనె, వెల్లుల్లి పేస్ట్, కలర్, సాస్ 

నిమ్మరసం, చాట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. పనీర్ 

ముక్కలకు ఈ మసాలా పట్టించి, ముక్కలు కట్ కాకుండా 10 

నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 

మసాలా పట్టించిన పనీర్‌ ముక్కలను ఒవెన్‌లో బేక్‌ చేయాలి. ఒవెన్‌ 

లేకుంటే బాణలిలో నూనె పోసి దోరగా వేయించుకోవాలి. వీటిని సర్వింగ్‌ 

బౌల్‌లోకి తీసి వెజిటబుల్‌ సలాడ్‌ కోసం వాడే అన్ని రకాల 

ముక్కలతోనూ గార్నిష్‌ చేసుకోవచ్చు. అంతే పిల్లల ఇష్టపడి తింటారు.

1 comment:

  1. I Love Andhra vantalu. Because i came to andhra once and i had paradise biryani i loved it so much and i stayed in hyderbad for 1 year so i learned little bit telugu. I had somany Telugu recipes in my owners house and its very tasty. but i dont know how to read telugu. why cant you write recipes in english also

    ReplyDelete