Monday, March 30, 2015

TOMOTO PIZZA


TOMOTO PIZZA ( టొమాటో పిజ్జా )





టొమాటో పిజ్జా కావలసినవి:



టొమాటో ముక్కలు - కప్పు,

క్యాప్సికమ్ తరుగు - పావుకప్పు,

వెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు,

ఉల్లిపాయ ముద్ద - 2 స్పూన్లు,

రోజ్‌మేరీ - పావుచెంచా,

ఆరీగానో - పావుచెంచా,

బేబీకార్న్ - రెండు,

పుట్టగొడుగులు - రెండుముక్కలు,
బటర్ - కొద్దిగా,

ఉప్పు - తగినంత,

కారం - తగినంత,

పిజ్జాబేస్ - 1 (బేకరీ, సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది),

బీన్స్ తరుగు - పావు కప్పు.







టొమాటో పిజ్జా తయారి:


ఒక పాన్‌లో కొద్దిగా బటర్ వేసి కాగిన తరవాత ఉల్లిపాయముద్ద, వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి 5 నిముషాలు ఉడికించి ఉప్పు, కారం కలపాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి 5 నిముషాలు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని పిజ్జా బేస్ మీద పరిచి పైన బీన్స్ తరుగు వేయాలి. దీనిని 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 5 నిముషాలు బేక్ చేయాలి.

Facebook Comments

No comments:

Post a Comment