Monday, March 30, 2015

Andhra-dishes-Chepala-Iguru-(చేపల-ఇగురు)

Chepala Iguru (చేపల ఇగురు)


చేపల ఇగురు కావలసిన పదార్ధాలు:


చేపలు - 1/2 కిలో,
పచ్చిమిరపకాయలు - రెండు,
జీలకర్ర - రెండు స్పూన్లు,
కొబ్బరి - సగం చిప్ప,
ఉల్లిపాయలు - రెండు,
వెల్లుల్లి - మూడు,
కొబ్బరి - అర్ధ చిప్ప,
కారం - రెండు స్పూన్లు,
పొడి మసాలా - కొంచెం,
పసుపు - రెండు స్పూన్లు,
అల్లం - చిన్న ముక్క,
ఉప్పు - సరిపడేంత.
చేపల ఇగురు ఇలా తయారు చేయండి : 

ముందుగా చేపలను శుభ్రపరుచుకుని.. మీకు కావలసిన సైజులో కట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఈలోగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను కూడా ముక్కలుగా చేసుకోవాలి. అలాగే కొబ్బరి కోరుకుని పాలు తీసి పెట్టుకుని.. అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మెత్తగా నూరుకోవాలి.ఇప్పుడు స్టౌమీద ఒక బాణలిలో నూనె పోసి అది బాగా కాగాక అందులో ఉల్లి, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి.. వేయించాక అందులో కారం, పసుపు, ఉప్పు, అల్లం ముద్ద, చేపముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక పావుశేరు నీళ్లు కూడా పోయాలి.కొద్ది సేపు ఉడికిన తర్వాత కొబ్బరి పాలు పోసి మళ్లీ ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తమీర చల్లి దించేస్తే వేడివేడి చేపల ఇగురు రెడీ.

2 comments:

  1. Nenu chesina Ravva chepa iguru kuda chusi ela undo cheppandi.
    Ramappa cheruvu ravva chepa iguru - cheruvu chepala iguru - chepala iguru andhra style - fish gravy
    https://www.youtube.com/watch?v=lLi3a5Wuwss

    ReplyDelete