Friday, March 27, 2015

Prawns Cutlet (రొయ్యల కట్‌లెట్)

Prawns Cutlet (రొయ్యల కట్‌లెట్)








కావలసిన పదార్థాలు :
చిన్న రొయ్యలు - 150 గ్రాములు
శనగపిండి - రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్
ఉల్లిపాయ - ఒకటి
కారం - అర టీస్పూన్
గరం మసాలా పొడి - ఒక స్పూన్
కొత్తిమీర - చిన్న కట్ట
నిమ్మరసం - ఒక స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
బియ్యం పిండి - అరకప్పు
నూనె - వేయించడానికి సరిపడినంత



తయారు చేయండి :


మొదట రొయ్యలను పొట్టు తీసి శుభ్రం చేసుకుని, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం పట్టించి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా తరిగి అందులో కారం, గరంమసాలా పొడి, శనగ పిండితోపాటు రొయ్యల్ని కూడా వేసి ముద్దలా తయారు చేసుకోవాలి. దీన్ని ఆరు భాగాలుగా చేసుకోవాలి. ఒక్కో ముద్దని వడలా వత్తుకుని రెండు వైపులా బియ్యం పిండిలో ముంచి, నూనెలో దోరగా వేయించాలి. వీటిని వేడి వేడిగా టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం కూడా.

2 comments:

  1. I have following question
    150 grams of prawns is it before cleaning or after cleaning ?

    Thanks in advance .

    ReplyDelete
  2. Before cleaning only

    ReplyDelete