Wednesday, May 6, 2015

South-Indian-Andhra-vantalu-Royyala-fried-rice-Prawns-fried-rice

రొయ్యల ఫ్రైడ్ రైస్ (Prawns Fried rice)

South-Indian-food-in-telugu-prawns-fried-rice

కావలసిన పదార్థాలు

రొయ్యలకోసం


రొయ్యలు - 1 cup



కార్న్ ఫ్లోర్ - 2 tablespoons


మైదా - 1 tablespoon


చిల్లి సాస్ - 1 tablespoon


సోయ్ సాస్ - 1 tablespoon


కోడి గ్రుడ్డు - 1


కారం




How to make Prawns fried rice

ఫ్రైడ్ రైస్ కోసం


బియ్యం - 2 cups
బీన్స్ - 1 cup తరిగినది
కారట్స్ - 1 cup సన్నగా తరిగినవి
ఉల్లిపాయలు - 1 cup తరిగినది
క్యాబేజీ - 1 cup తరిగినది
పచ్చి మిరపకాయలు - 10 సన్నగా తరిగినవి
కొత్తిమీర - 1 /2 cup తరిగినది
కోడి గ్రుడ్లు - 2
చిల్లి సాస్
సోయ్ సాస్
అజినోమోటో
ఉప్పు
నూనె


Preparation of Prawns fried rice

తయారు చేసే విధానము



ముందుగ కార్న్ ఫ్లోర్, మైదా , చిల్లి సాస్, సోయ్ సాస్, తగినంత కారం, ఉప్పు ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఒక గ్రుడ్డు ని గిలకోట్టుకొని పెట్టుకోవాలి.
పైన చెప్పిన పదార్థాలు అన్నిటిని గ్రుడ్డు వేసి పేస్టు లాగ కలుపుకోవాలి.
ఇప్పుడు రొయ్యలను వేసి బాగా కలపాలి.
ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె పోసి కాగాక రొయ్యలు ఒక్కొక్కటి వేసి fry చేసుకోవాలి.


Fry అయినవాటిని పక్కన పెట్టుకోవాలి.
చెప్పిన కూరగాయలు అన్నిటిని చూపించిన విధం గ తరిగి పెట్టుకోవాలి.
బియ్యం ని నీళ్ళల్లో అర్ధ గంట పాటు నాన పెట్టుకోవాలి. తరువాత నీళ్లన్నీ వంచేయాలి.
వేరే గిన్నె లో 4 గ్లాస్ ల నీళ్ళు పోసి కాగ పెట్టుకోవాలి.
అందులో రెండు గరిటెల నూనె పోసి నాన పెట్టిన బియ్యం ని కూడా వేసి 3 /4 th ఉడికేంత వరకు ఉడికించాలి.
నీల్ల్లని వడార్చి పక్కన పెట్టుకోవాలి.
ఒక బాండలి లో రెండు గరిటెల నూనె పోసి వేడి చేసుకోవాలి.
అందులో గిలకోట్టుకొన్న రెండు గ్రుడ్లను వేయాలి.
ఒక నిముషం తరువాత ఈ ఆమ్లెట్ ని ముక్కలుగా చేసుకోవాలి.
ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి.
వేగాక అన్ని కూరగాయ ముక్కలను కూడా వేసి అవి మగ్గెంత వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు ఉదికిన్చుక్న్న అన్నం, 1 tablespoon చిల్లి సాస్, 1 teaspoon సోయ్ సాస్, చిటికెడు అజినోమోటో, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
అన్ని బాగా కలిసెంత వరకు కలుపుకోవాలి.
ఇప్పుడు చేసి పెట్టుకొన్న రొయ్యలను కూడా వేసి కలపాలి.
ఆఖరున కొత్తిమీర కూడా చల్లి దించేయాలి.
అంతే వేడి వేడి రొయ్యల ఫ్రైడ్ రైస్ తయార్....


Keywords: Andhra Kitchen Dishes, Andhra vantalu, South Indian recipes, Telugu vantalu, Telugu recipes, Telugu dishes, Prawns recipes, Evening Snacks

Facebook Comments

No comments:

Post a Comment