Wednesday, May 13, 2015

Indian-kitchen-recipes-How-to-cook-Dry-fruit-Laddu

డ్రైఫ్రూట్స్ లడ్డు (Dry Fruit Laddu)

Indian-kitchen-recipes-How-to-cook-Dry-fruit-Laddu

డ్రైఫ్రూట్స్ లడ్డు గర్భిణులకు ఎంతో బలవర్ధకమైన ఆహారం. వీటిలో జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వాడటం వల్ల ముఖ్యంగా గర్భిణులకి కావలసిన మాంసకృత్తులు అందుతాయి.


కావలసిన పదార్ధాలు:

జీడిపప్పు - ఒక కప్పు
బాదంపప్పు- ఒక కప్పు
పిస్తాపప్పు - ఒక కప్పు
ఖర్జూరాలు - 250 గ్రాములు
గసగసాలు - 50 గ్రాములు
నెయ్యి - 100 గ్రాములు
పంచదార - 100 గ్రాములు
ఏలకులు - 4

How to prepare Dry fruit laddu?

తయారుచేసే విధానం:

ముందుగా జీడిపప్పు , బాదంపప్పు, పిస్తాపప్పు చిన్న ముక్కలుగా చేసుకువాలి. ఒక బాణలిలో నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టుకొని గసగసాల్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పావు లీటరు నీళ్ళు తీసుకుని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు 100 గ్రాముల పంచదార కలిపి నీళ్ళ పాకం పట్టాలి. ఇప్పుడు ఆ పాకంలో పావుకిలో ఖర్జూరాలు కలిపి అవి మెత్తగా అయ్యేదాకా ఉంచాలి. తర్వాత ఏలకుల పొడి సువాసన కోసం కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఇంతకు ముందు వేయించి పెట్టుకున్న పప్పుల్ని, గసగసాల్ని కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చుట్టుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తినడానికి రెడీ.

Facebook Comments

No comments:

Post a Comment