Wednesday, April 22, 2015

Andhra-Telugu-vantalu-Pala Purilu

Pala Purilu పాల పూరీలు

Telugu-Vantalu




Ingredients:

కావలసిన పదార్థాలు :
పాలు - అర లీటరు
పంచదార - 200గ్రా
కొబ్బరి పాలు - అర లీటరు (కొబ్బరి కోరుని మిక్సీలో వేసి చిక్కగా పాలు తీసుకోవాలి)
యాలకుల పొడి - కొద్దిగా
మైదా - 200గ్రా
గోధుమపిండి - 200గ్రా
ఉప్పు - అరచెంచా
గసగసాలు - 25గ్రా
పూరీలు వేయించడానికి
సరిపడా నూనె

PREPARATION :
తయారీ విధానం :
ముందుగా మైదా, గోధుమపిండి, ఉప్పు, నీళ్లు వేసి పూరీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. కాచిన పాలలో పంచదార, కొబ్బరిపాలు, యాలకుల పొడి,
గసగసాల పొడి(నూనె వేయకుండా వేయించి పొడిచేసి ఉంచుకోవాలి) వేసి పంచదార బాగా కరిగేవరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండితో పూరీలు చేసి ఎర్రగా వేయించి ఈ పాలలో వేయాలి. ఇవి బాగా నానితే మంచి రుచితో నోరూరిస్తాయి. ఈ పాల పూరీలు మంచి బలమైన ఆహారం కూడా

Andhra Telugu Kitchen Vantalu







Facebook Comments

No comments:

Post a Comment