Thursday, March 26, 2015

Fried Chicken Rolls in Telugu

Fried Chicken Rolls     ఫ్రైడ్‌ చికెన్‌ రోల్స్‌











కావలసినవి :
బోన్లెస్ చికెన్‌ : 150 గ్రాములు
బీన్స్‌ : అరకప్పు
క్యారెట్‌ ముక్కలు : అరకప్పు
ఉప్పు : తగినంత.
మసాలా పౌడర్ : ఒక స్పూన్
కారం : సరిపడగా
మైదా పిండి : పావు కిలో
కొత్తిమీర : కొద్దిగా
గుడ్డు : ఒకటి
క్యాబేజి తురుము  : అరకప్పు
నూనె : అర లీటర్‌
ఉల్లిపాయ : ఒకటి

తయారీ :
ముందుగా మైదాను ఓ గిన్నెలో వేసి గుడ్డులోని తెల్లసొనను వేసి సరిపడ నీరును పోసి  చపాతీ పిండిలాగా మెత్తగా కలిపి  తడిగుడ్డతో కప్పి అరగంట సేపు నానపెట్టాలి. ఇప్పుడు 
చికెన్‌ను ఉడకబెట్టు కోవాలి. కూరలను, చికెన్‌ను సన్నని పొడు గాటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి ముక్కలు, బీన్స్‌, క్యాబేజి, క్యారెట్‌ ముక్కలు, కారం, ఉప్పు వేసి తరువాత చికెన్‌ వేసి మసాలా పౌడర్ వేసి బాగా  వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు కలిపి ఉంచుకున్న పిండిని చపాతీల్లా వత్తి అందులో చికెన్‌ మసాలా మిశ్రమాన్ని పెట్టి మూసి రోల్స్‌లాగా చుట్టి పెట్టాలి. తరువాత స్టవ్ పై పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగాక అందులో చపాతీలను నూనెలో ఎర్రగా వేయించి  ప్లేట్ లో వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి

Facebook Comments

No comments:

Post a Comment